సుబోధ్ ఫ్యామిలి : గోరక్షణ అల్లర్ల ముసుగులోనే చంపేశారు..

13:12 - December 5, 2018

లక్నో (ఉత్తరప్రదేశ్) : బులంద్‌షహర్‌లో గోరక్షక దళాలు, హిందూ గ్రూపులు నిర్వహించిన ఆందోళన హింసాత్మకంగా మారిన నేపథ్యంలో చెలరేగిన అల్లర్లలో ఆందోళనకారులు చేసిన దాడిలో సీఐ సోబోధ్ కుమార్ దారుణంగా మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భర్త మృతిపై సుబోధ్ భార్య సునీత తీవ్ర ఆవేదన చెందారు. అల్లర్లు జరిగన రోజు తన భర్త సెలవు కోరారనీ..అయిన ఇవ్వకుండా డ్యూటీమీద అల్లర్లు జరిగే ప్రాంతానికి వెళ్లారనీ..సెలవు ఇచ్చుంటే తన భర్త బ్రతికి వుండేవారు కదా? అని పోలీసులు అధికారులను కన్నీరు మున్నీరవుతు ప్రశ్నించింది. తన భర్త మరణానికి కారణమైనవారిని కఠినంగా శిక్షించాలనీ..అప్పుడే తన భర్త ఆత్మకు శాంతి అని అలా జరిగితేనే తన భర్త నిజాయితీకి సరైన నివాళి జరిగినట్లు అని సునీత వాపోయారు. నిందితులకు కఠినంగా శిక్షించాలని సునీత డిమాండ్ చేశారు. కాగా సుబోధ్ పై రాళ్లతో తీవ్రంగా దాడి చేసిన అనంతరం ఆందోళన కారులు కాల్చి చంపివేసిన విషయం తెలిసిందే. 
సుబోధ్ ను  ఆందోనకారులు ప్లాన్ ప్రకారమే చంపారా?
కాగా  గోమాంసం తిన్నాడన్న ఆరోపణలతో 2015లో అఖ్‌లాక్ అనే ముస్లిం వ్యక్తిని కొందరు వ్యక్తులు కొట్టి చంపారు. ఈ కేసును సుబోధ్ దర్యాప్తు చేస్తున్నారు. సుబోధ్ మరణానికి ఈ కేసుకు సంబంధం ఉందని ఆయన సోదరి ఆరోపించటం గమనార్హం. 
ఇంకా ఎంతమంది కుటుంబాల్లో ఈ విషాదాలు?  : సుభోద్ కుమారుడు
సుబోధ్ కుమార్ కుమారుడు అభిషేక్ మాట్లాడుతూ మతం పేరుతో సమాజంలో హింసకు తావులేదని చెప్పేవారని గుర్తు చేసుకున్నాడు. హిందూ-ముస్లిం వివాదంలో నేడు తన తండ్రి మరణించాడని, రేపు ఎవరి తండ్రి మరణిస్తాడోనని ఆందోళన వ్యక్తంచేశారు. ఇంకా ఇటువంటి విషాదాలు ఇంకా ఎంతమంది కుటుంబాలు బలవ్వాలని..దీనికి ప్రభుత్వం వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
నా ప్రాణాలు కాపాడుకోవటానికి పారిపోయా : డ్రైవర్ ఆశ్రయ్
సీఐతో పాటి అల్లర్లు జరుగుతున్న బులంద్‌షహర్‌ ప్రాంతానికి సీఐ సుభోధ్ కుమార్ తో పాటు జీప్ డ్రైవర్ గా వెళ్లిన ఆశ్రయ్ మాట్లాడుతు..గాయపడి ఓ గోడవద్ద స్పృహ తప్పిన స్థితిలో వున్న సుభోద్ సార్ ను వాహనంలో ఎక్కించి జీపును స్టార్ట్ చేసే లోపే ఓ గుంపు తమపై రాళ్లు రువ్వడంతో జీపును వదిలేసి తన ప్రాణాలు కాపాడుకోవటానికి పారిపోయానని కన్నీటితో తెలిపాడు ఆశ్రయ్.
సుభోధ కుటుంబానికి ఆర్థిక సహాయం ప్రకటించిన సీఎం యోగీ..
ఆందోళనకారుల దాడిలో మృతి చెందిన సుబోధ్ కుటుంబానికి యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రూ.40 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ఆయన తల్లిదండ్రులకు రూ. 10 లక్షలు, కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్టు తెలిపారు.
 

Don't Miss