మ‌నిషి పెరిగినా బుద్ధి పెర‌గ‌లేదు.. అచ్చెన్నాయుడిపై సీఎం జ‌గ‌న్ వ్యాఖ్యలు

Submitted on 11 July 2019
CM Jagan Speech | CM Jagan Criticised Achennayudu

మనిషి ఆ సైజులో ఉన్నాడు..కానీ బుద్ధి పెరగలేదు అంటూ సీఎం జగన్..టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రసంగించే సమయంలో అడ్డు తగలడంపై ఆయన క్లాస్ పీకారు. ఏపీ అసెంబ్లీలో కరవుపై చర్చ జరుగుతోంది. గత ప్రభుత్వం ఏమి చేసింది..అధికారంలోకి వచ్చిన తర్వాత తమ ప్రభుత్వం ఏం చేసింది..ఏం చేయబోతోందనే దానిపై సీఎం జగన్ వివరిస్తున్నారు. అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ ద్వారా లెక్కలు చెప్పారు సీఎం జగన్.

ఒక్కసారిగా..అచ్చెన్నాయుడు జోక్యం చేసుకున్నారు. పాయింట్ ఆఫ్ ఆర్డర్ అంటూ..వేలెత్తి చూపెట్టారు. దీనిని స్పీకర్ తిరస్కరించారు. తర్వాత మాట్లాడాలని చెప్పారు. అయినా అచ్చెన్నాయుడు వినిపించుకోలేదు. దీనిపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం మాట్లాడుతున్నాడో..ఎందుకు మాట్లాడుతున్నాడో తెలియదు అంటూ అచ్చెన్నాయుడుని ఉద్దేశించి అన్నారు. ఈ పక్కన మాట్లాడుతున్నాను..

ఆయనకు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడొచ్చు..ఎవరూ అడ్డుకోరు..సభాధ్యక్షుడు మాట్లాడుతుంటే..పాయింట్ ఆఫ్ ఆర్డర్ అంటూ అడగడం కరక్టా అని ప్రశ్నించారు. ఐదు సంవత్సరాల కింద ఏ సంప్రాదాయం పాటించారో..ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇలాగే వ్యవహరిస్తున్నారు..ఇక మీరు మారరా..అంటూ ప్రశ్నించారు. వయస్సు పెరుగుతోంది...బుద్ధి మాత్రం పెరగడం లేదు..ఎదిగే కొద్ది ఒదగాలి అంటూ ప్రతిపక్షానికి సూచించారు సీఎం జగన్. తర్వాత సీఎం జగన్ కరవుపై మాట్లాడారు. 

CM Jagan Speech
cm jagan
Criticised
achennayudu


మరిన్ని వార్తలు