ఆమెతో విరోధం లేదు కానీ : మిథాలీపై కోచ్ సంచలన వ్యాఖ్యలు..

13:08 - November 29, 2018

న్యూఢిల్లీ: మహిళా క్రికెట్స్ లో చరిత్ర సృష్టించిన మాజీ కెప్టెన్ మిథాలీరాజ్ పై కోచ్ రమేశ్ పొవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీసీఐ అధికారుల ఎదుట విచారణకు హాజరయిన రమేశ్ పొవార్ టీ20 మహిళా ప్రపంచ కప్ సెమీ ఫైనల్ తుది జట్టులోకి మిథాలీ రాజ్ ను తప్పించడంపై జట్టు కోచ్ రమేష్ పొవార్ వివరణ ఇచ్చేందుకు వచ్చిన పొవార్ మిథాలీపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. వివాదంపై కోచ్ రమేశ్ పవార్ బీసీసీఐ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. మిథాలీ రాజ్ ఎవరితో కలిసి ఉండేది కాదని, ఎప్పుడూ తప్పించుకొని తిరిగేదని రమేష్ పొవార్ చెప్పినట్లు సమాచారం.  
తనపై ఎవరో ఒత్తిడి తేవడం వల్లే మిథాలీని జట్టు నుంచి తప్పించారనే మాటలో నిజం లేదని చెప్పినట్లు ఆయన తెలిపారు. ఆమె చెత్త స్ట్రైక్ రేట్ కారణంగానే ఆమెను జట్టు నుంచి తప్పించాల్సి వచ్చిందని రమేష్ పొవార్ అన్నారు.
ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో ఆమెను తప్పించడానికి ఆమెపై విరోధంతో కాదని, కేవలం ఆమె స్ట్రైక్ రేట్‌ని చూసి తప్పించామని పొవార్ చెప్పినట్లు బిసిసిఐ అధికారి ఒకరు చెప్పారు. విజయం సాధించే జట్టునే బరిలోకి దింపాలనే ఉద్ధేశ్యమే కానీ ఆమెపై ఎటువంటి విరోధం లేదని రమేష్ పొవార్ బీసీసీఐకి పొవార్ వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆమెను జట్టు నుంచి తప్పించడంలో తనపై ఎటువంటి ఒత్తిడి లేదని, ఆమె స్ట్రైక్‌రేట్ కారణంగానే జట్టు నుంచి తప్పించాం కానీ ఎవరో అధికారి ఒత్తిడి చేస్తే తప్పించలేదని ఆయన చెప్పారు.కాగా ఈ నేపథ్యంలో జట్టు కోచ్ రమేశ్ పొవార్ తనను అవమానించారని ఆరోపిస్తూ మిథాలీ బిసిసిఐకి ఓ లేఖ రాశారు. తనను జట్టు నుంచి తప్పించారని తెలిసి ఎంతో బాధపడ్డానని లేఖలో తెలపటం గమనించాల్సిన విషయం. ఏది ఏమైనా బ్యాటింగ్ సత్తాపై ఏమాత్రం పట్టు సడలని మిథాలీ రాజ్ ను మ్యాచ్ నుండి తప్పించటంలో కోచ్ పాత్ర వుందని..ఆమెను కావాలనే తప్పించటంపై నెటిజన్స్  టీం యాజమన్యంపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. 
 

Don't Miss