సూర్య సినిమాలో మోహన్ బాబు

Submitted on 13 June 2019
Collection King Mohan Babu to play a key Role in Suriya’s Soorarai Pottru

విలన్‌గా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పలు డిఫరెంట్ రోల్స్‌తో ఆడియన్స్‌ను ఆకట్టుకున్న కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, కోలీవుడ్‌లో సూర్య సినిమాలో ఇంపార్టెంట్ రోల్ చెయ్యనున్నాడు. ఇంతకుముందు యమదొంగ, బుజ్జిగాడు సినిమాలలో మోహన్ బాబు ఇంపార్టెంట్ రోల్స్ చెయ్యగా వాటికి మంచి గుర్తింపు వచ్చింది.

గురు ఫేమ్ సుధ కొంగర దర్శకత్వంలో, 2డి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సూర్య నటిస్తూ, నిర్మస్తున్న సినిమా 'సూరరై పొట్రు'.. ఈ సినిమాలో ఓ కీ క్యారెక్టర్ కోసం మోహన్ బాబుని సంప్రదించగా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.. జూన్ 14 నుండి చెన్నైలో జరగనున్న షూటింగ్‌లో మోహన్ బాబు జాయిన్ అవనున్నాడు.

సుధ, మోహన్ బాబు కూతురు లక్ష్మీ ప్రసన్న మంచి ఫ్రెండ్స్.. లక్ష్మీ ప్రసన్న చెప్పడం, కథ నచ్చడంతో మోహన్ బాబు ఈ సినిమా చెయ్యడానికి అంగీకరించారట.. బాలీవుడ్ ప్రొడ్యూసర్ గునీత్ మోంగా నిర్మాణంలో పాలుపంచుకుంటుండగా, జివి ప్రకాష్ కుమార్ సంగీతమందిస్తున్నాడు.
 

Suriya
Mohan Babu
G. V. Prakash Kumar
2D Entertainment
Sudha Kongara

మరిన్ని వార్తలు