డైరెక్టర్‌గా మారిన శ్రీనివాస రెడ్డి

Submitted on 16 May 2019
Comedian Srinivasa Reddy as Director?

చక్కటి కామెడీ టైమింగ్‌తో ఆడియన్స్‌ని ఆకట్టుకున్న కమెడియన్ శ్రీనివాస రెడ్డి డైరెక్టర్‌గా టర్న్ అయ్యాడని ఫిలింనగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. కమెడియన్‌గానే కాక, 'గీతాంజలి', 'జయమ్ము నిశ్చయమ్మురా', 'ఆనందోబ్రహ్మ' వంటి సినిమాలలో హీరోగానూ నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. శ్రీనివాస రెడ్డి.. అతను కొంత కాలంగా తనతోటి కమెడియన్స్‌తో కలిసి 'ఫ్లయింగ్ కలర్స్' అనే గ్రూప్‌ని మెయింటెన్ చేస్తున్నాడు. 'ఫ్లయింగ్ కలర్స్ మంథ్లీ మీట్' పేరుతో వీళ్ళంతా రెగ్యులర్‌గా కలుస్తుంటారు కూడా..

ఇప్పుడు ఈ గ్రూపులోని మెంబర్స్ అంతా కలిసి అదే పేరుతో ప్రొడక్షన్ హౌస్ ఏర్పాటు చేసి, ఒక సినిమాని నిర్మించబోతున్నారని, ఆ సినిమా దర్శకత్వ బాధ్యతలు రెడ్డికి అప్పగించారని తెలుస్తుంది. ఈ సినిమాకి 'భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు' అనే గమ్మత్తైన టైటిల్ పెట్టారని, షూటింగ్ కూడా దాదాపుగా పూర్తికావొచ్చిందని కూడా అంటున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. కమెడియన్‌గా గుర్తింపు పొందిన శ్రీనివాస రెడ్డి  డైరెక్టర్‌గా ఆడియన్స్‌ని ఎంత వరకు ఆకట్టుకుంటాడో చూడాలి.

Srinivasa reddy
Flying Colours
Srinivasa Reddy as Director

మరిన్ని వార్తలు