చత్తీస్ ఘడ్ కాంగ్రెస్ క్యాంప్ రాజకీయాలు

09:34 - December 5, 2018

ఢిల్లీ :  ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌ పార్టీ అధికారం చేపట్టనుందా? దీని కోసం క్యాంప్ రాజకీయాలకు తెరలేపనుందా? ఎన్నికల అనంతరం కాంగ్రెస్ కు అందిన సమాచారం ప్రకారంగా కాంగ్రెస్ పావులు కదుపుతోందా? కర్ణాటకలో అధికారం చేపట్టేందుకు జేడీఎస్ తో కలిసి  కాంగ్రెస్ పన్నిన వ్యూహమే  ఛత్తీస్ గడ్ లో కూడా అమలు చేసేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతున్నట్లుగా రాజకీయా వర్గాల సమాచారం. దీని కోసం కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. ఎన్నిక అనంతరం కాంగ్రెస్ కు అందిన సమాచారం ప్రకారం క్యాంప్ రాజకీయాలకు తెరలేపనుందనే సమచారాం.
ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ యత్నాల యోచన..
చాలా కాలం తరువాత రాష్ట్రంలో అధికారం చేతికందబోతోందనే విశ్లేషణలు వినిపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ నేతలు అప్రమత్తమయ్యారు. కర్ణాటకలో ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు హైదరాబాద్ కు తరలించి స్టార్ హోటల్స్ లో దాచిపెట్టి ఎట్టకేలకు జేడీఎస్ తో జత కట్టి సంకీర్ణప్రభుత్వంలో భాగస్వామిగా వున్న కాంగ్రెస్ మరోసారి అదే వ్యూహాలను అమలు చేసేందుకు యత్నిస్తోంది.  
ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే గెలిచిన అభ్యర్థులందరినీ  స్టార్‌ హోటల్‌ లేదా రిసార్టుకు తరలించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. ఛత్తీస్‌గఢ్‌లో కచ్చితంగా 50 సీట్లు వస్తాయని కాంగ్రెస్‌ అధిష్టానం అంచనా వేస్తోంది. కాంగ్రెస్‌కు అనుకూలంగా జిల్లాల నుంచి వచ్చిన సమాచారాన్ని జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి రాష్ట్ర నేతలు తెలియజేశారు. ఈ నేపథ్యంలో వారికి రాహుల్‌ కొన్ని సూచనలు చేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటయ్యేవరకు జాగ్రత్తగా ఉండాలని, అతివిశ్వాసంతో ముందుగా సంబరాలు చేసుకోవద్దని రాహుల్  హెచ్చరించినట్లుగా తెలుస్తోంది. అలాగే ఫలితం అనుకూలంగా వచ్చిన వెంటనే గెలిచిన ఎమ్మెల్యేలందరిని ఏదైనా ఒక చోట సురక్షితంగా ఉంచాలని సూచించినట్లు సమాచారం. మరి కాంగ్రెస్ క్యాంప్ రాజకీయాలు విజయం సాధించి ఛత్తీస్ గఢ్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోందో లేదో వేచి చూడాలి.
 

Don't Miss