సంచలనం రేపుతున్న సబితా వ్యాఖ్యలు..

06:47 - November 5, 2018

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాలలో ఇప్పటివరకూ మహిళలు సీఎం పదవి చేపట్టలేదు. కానీ ఆరోజు రానుందా? అదీ ఈ వచ్చే ఎన్నికల్లోనే ఆ కొరత తీరిపోనుందా? తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో కొనసాగుతున్న పోరులో మహా కూటమి గెలుపు సాధిస్తుందా? మహా కూటమి గెలుపు సాధిస్తే తానే సీఎంనవుతానని ధీమా వ్యక్తంచేస్తున్నారు కాంగ్రెస్ సీనియుర్ నేత..దివంగత ముఖ్యమంత్రికి దేవుడిచ్చిన చెల్లెమ్మగా పేరు తెచ్చుకున్న మాజీ హోం మినిష్టర్ సబితా ఇంద్రారెడ్డి. సబితా ఇంద్రారెడ్డి అంతే మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డికి ప్రత్యేకమైన అభిమానం అనే సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కాంగ్రెస్ లో ఎంతోమంది సీనియర్ నేతలున్నా కూడా ఆమెనే హోం మినిష్టర్ ను చేశారు రాజశేఖర్ రెడ్డి. ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో మహా కూటమి గెలిస్తే తానే సీఎంని అవుతానని సబితా ఇంద్రారెడ్డి ధీమా వ్యక్తంచేస్తున్నారు. ఈ వ్యాఖ్యలతో కాంగ్రెస్ సీనియర్ నేతలు ఖంగుతిన్నారు. కలవర పడుతున్నారు. అంతేకాదు  మహేశ్వరం నియోజకవర్గం నుండి లక్ష ఓట్ల మెజారిటీతో గెలుస్తానని ధీమా వ్యక్తంచేస్తున్నారు సబితా..
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో సీఎం పదవి కోసం చాలా మంది సీనియర్లు పోటీపడుతున్నారు. తాజాగా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. నేడు మహేశ్వరం నియోజకవర్గంలో పర్యటించిన ఆమె మాట్లాడుతూ.. తాను ఎమ్మెల్యేగా గెలిస్తే సీఎం అయ్యే అవకాశం ఉందన్నారు.

మహేశ్వరం నుంచి తాను లక్ష ఓట్ల మెజారిటీతో గెలుస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి చేశామంటున్న టీఆర్ఎస్ నేతలు మహేశ్వరంలోని శ్రీరాంనగర్ కాలనీకి వచ్చి చూడాలని కాలనీ వాసులు పేదరికంలో మగ్గుతున్నారని సబితా ఇంద్రారెడ్డి వాపోయారు. మరి సబితా వ్యాఖ్యలతో కాంగ్రెస్ సీనియర్ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.
 

Don't Miss