బీజేపీలో బ్లాక్ షీప్స్...కర్ణాటక ఎమ్మెల్యేలందరూ రిసార్టులోనే

Submitted on 12 July 2019
 Congress leader Siddaramaiah:BJP is afraid because they know there are black sheep in their party.

కర్ణాటకలో మరోసారి రిసార్ట్ రాజకీయాలకు తెరలేచింది. కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ సర్కార్‌లో భాగమైన ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు ఇరు పార్టీల ముఖ్యనేతలు రంగంలోకి దిగారు. ఈ సమయంలో బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు తమ ఎమ్మెల్యేలను ప్రత్యేక బస్సుల్లో బెంగళూరు శివారులోని రిసార్టులకు తరలిస్తున్నాయి. కర్ణాటక వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ఇవాళ అసెంబ్లీ సమావేశం ముగిన తర్వాత అసెంబ్లీ నుంచి నేరుగా బెంగళూరు శివార్లలోని రమదా రిసార్ట్ కి బీజేపీ తన ఎమ్మెల్యేలను ప్రత్యేక బస్సుల్లో తరలించింది. ఇక జేడీఎస్ కూడా తమ  ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచే నందీ హిల్స్ రోడ్ లోని ప్రిస్టేజ్ గోల్ఫ్ ఫైర్ రిసార్ట్ కి తరలించింది. మరోవైపు అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి కుమారస్వామి ఇవాళ అసెంబ్లీలో ప్రకటించిన సమయంలో ప్రతిపక్ష బీజేపీ అప్రమత్తమైంది. మరోవైపు స్పీకర్ కూడా సీఎం కుమారస్వామి ఎప్పుడంటే అప్పుడు విశ్వాస తీర్మానంపై నిర్వహిస్తామని చెప్పడంతో బీజేపీ అలర్ట్ అయింది.

ఈ సందర్భంగా కాంగ్రెస్ సీఎల్పీ నాయకుడు,మాజీ సీఎం సిద్దరామయ్య మాట్లాడుతూ...మేము కాన్పిడెంట్ గా ఉన్నాం కాబట్టే బలపరీక్షకు రెడీ అయ్యాం. తమ పార్టీలో బ్లాక్ షీప్ లు ఉన్నాయని బీజేపీ భయపడుతోందన్నారు. మరోవైపు . రెబల్‌ ఎమ్మెల్యేల రాజీనామాలు, అనర్హత వేటుపై యథాతథస్థితిని కొనసాగించాలని ఇవాళ సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కేసులో జులై- 15,2019న  తదుపరి విచారణ చేపడతామని తెలిపింది.

కర్ణాటకలో మొత్తం 224 మంది ఎమ్మెల్యేలున్నారు. వీరిలో 16 మంది రాజీనామాలు చేశారు. అయితే వీరి రాజీనామాలను స్పీకర్‌ ఇప్పుడు అంగీకరించకూడదు కనుక మంగళవారం వరకు ఎమ్మెల్యేలుగానే ఉంటారు. శాసనసభలోబీజేపీ బలం 107, రాజీనామా చేసిన ఎమ్మెల్యేలను తీసేస్తే సంకీర్ణం సంఖ్యా బలం 100.

BJP
karnataka
Congress
JDS
MLA's
Resort
Assembly
Party
AFRAED


మరిన్ని వార్తలు