అంబానీలకు సుప్రీంలో చుక్కెదురు..

ఢిల్లీ : అంబానీ సోదరుల డీల్‌కు మరోసారి అవరోధం ఎదురైంది. అనిల్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌కు చెందిన టవర్ల విక్రయానికి వీలుగా జాతీయ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ ఇచ్చిన అనుమతులపై సుప్రీంకోర్టు నేడు స్టే విధించింది. దీనికి సంబంధించి హెచ్‌ఎస్‌బీసీ డైరీ ఇన్వెస్ట్‌మెంట్స్‌, రిలయన్స్‌ ఇన్‌ఫ్రాటెల్‌ వాటాదార్లు వేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం ఈ విధంగా తీర్పు వెల్లడించింది. రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌తో తీవ్ర అప్పుల్లో కూరుకుపోయిన అనిల్‌ అంబానీ ఆ భారాన్ని తగ్గించుకునేందుకు గతేడాది డిసెంబరులో సోదరుడు ముఖేశ్ అంబానీతో ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. 

Don't Miss