అనుష్క...ఇలానా..?

10:06 - August 15, 2015

'అనుష్క'...టాలీవుడ్ లో తనదైన నటనశైలిని ప్రదర్శిస్తూ ముందుకెళుతోంది. ఇటీవలే విడుదలైన 'బాహుబలి'లో ఆమె వైవిధ్యమైన పాత్రలో నటించింది. తాజాగా 'సైజ్ జీరో' చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదలైంది. ఇందులో 'అనుష్క'ను చూసి అభిమానులు షాక్ అయ్యారంట. ఎందుకంటే ఎవరూ ఊహించని విధంగా భారీ స్థూలకాయంతో ఈ ముద్దుగుమ్మ కనిపించింది. గడిచిన సినిమాల్లో స్లిమ్‌గా కనిపించిన 'అనుష్క' ఊహించని విధంగా ఇలా కనిపించడంతో వీరాభిమానులు ఒక్కసారిగా షాకయ్యారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కొడుకు ప్రకాష్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో యోగా బ్యూటీ.. రెండు విభిన్న గెటప్స్‌లో కనిపించనున్నట్లు టాక్. ఓ రోల్ కోసం 20 కేజీలు పెరిగిందని, మరో క్యారెక్టర్‌లో నార్మల్‌గానే కనిపిస్తోందని టాలీవుడ్ టాక్. ఇక అనుష్క పక్కన తమిళ నటుడు 'ఆర్య' నటిస్తున్నాడు. పీవీపీ బ్యానర్‌లో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళంలో అక్టోబర్ 2న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారంట. మరి 'అనుష్క' పాత్ర ఎలా ఉంటుందో తెలియాలంటే అప్పటి వరకు వేచి ఉండాల్సిందే.

Don't Miss