అబ్బాయిలు 18 పెళ్లి చేసుకోవచ్చన్న లా కమిషన్..

ఢిల్లీ : పురుషుల కనీస వివాహ అర్హత వయసు తగ్గే అవకాశం వుంది. ఇకపై అబ్బాయిలు 18 ఏళ్లకే పెళ్లి చేసుకోవచ్చంటూ లాకమిషన్ సంచలన ప్రతిపాదన చేసింది. ఇప్పటి వరకు వివాహ అర్హత వయసు 21 ఏళ్లుగా ఉండగా, ఇప్పుడు దానిని మూడేళ్లు తగ్గించి 18 ఏళ్లుగా ప్రతిపాదన చేసింది. యథార్థంగా సమానత్వం సాధించాలంటే స్త్రీ, పురుషులిద్దరి వివాహ కనీస అర్హత వయసు 18 ఏళ్లుగా ఉండాలని భారత ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. అయితే, అమ్మాయిల వివాహ అర్హత కనీస వయసును 18 ఏళ్లుగానే ఉంచొచ్చని పేర్కొంది. ఇండియన్ మెజారిటీ యాక్ట్ 1875 ప్రకారం.. ఓ వ్యక్తి మెజారిటీ వయసు 18 ఏళ్లని, స్త్రీపురుషులిద్దరికీ ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది.

Don't Miss