అసెంబ్లీ నుంచి 11 మంది కాంగ్రెస్‌ సభ్యులపై సస్పెండ్‌

21:04 - March 13, 2018

హైదరాబాద్ : గవర్నర్‌ ప్రసంగం సందర్భంగా నిన్న అసెంబ్లీలో అనుచితంగా ప్రవర్తించారంటూ... 11 మంది కాంగ్రెస్‌ సభ్యులను ఈ సమావేశాలు ముగిసేవరకు సస్పెండ్‌ చేశారు. సభ ప్రారంభమైన వెంటనే సభాపతి మధుసూదనాచారి ఈ అంశంపై తీవ్ర మనస్తాపం వ్యక్తం చేశారు. ఆ తర్వాత శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రవేశపెట్టిన పది మంది కాంగ్రెస్‌ సభ్యుల సస్పెన్షన్‌ తీర్మానాన్ని సభ  ఆమోదించింది. 
 

 

Don't Miss