ఆరు నెలల్లో రైతుల సమ్యలకు పరిష్కారం: ఫడ్నవీస్

మహారాష్ట్ర : ఎట్టకేలకు రైతన్నలతో చర్చించేందుకు మహారాష్ట్ర సర్కార్ దిగివచ్చింది. రైతు నాయకులతో చర్చలు జరిపేందుకు ఓ కమిటీని వేసిన ప్రభుత్వం వారితో చర్చలు జరిపింది. ఆరు నెలల్లో సమస్యలు పరిష్కరిస్తామని సీఎం ఫడ్నవీస్ రైతు సంఘం నాయకులకు హామీ ఇచ్చారు. డిమాండ్ ల సాధన కోసం మహా లాంగ్ మార్చ్ నాసిక్ నుండి ముంబైలోని ఆజాద్ మైదానానికి మహాలాంగ్ మార్చ్ గా రైతన్నలు తరలివచ్చింది. 50 వేల మంది రైతులతో ముంబై ఎర్ర సముద్రాన్ని తలపించిన రైతుల లాంగ్‌ మార్చ్‌ ముంబైలోని ఆజాద్‌ మైదానానికి చేరుకుంది. రైతులతో చర్చలు జరిపేందుకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ ఆరుగురు మంత్రులతో ఓ కమిటీ ఏర్పాటు చేసి రైతు సంఘం నాయకులతో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ఆరు నెలలలో రైతుల సమస్యలు తీరుస్తామని హామీ ఇచ్చారు. 

Don't Miss