ఊళ్లన్నీ హైదరాబాద్ రోడ్డెక్కుతున్నాయి!..

హైదరాబాద్ : తెలంగాణ గులాబి దండు కదిలింది. జనజాతరకు ప్రజలు తరలిరావడం మొదలైంది! ప్రభలు కట్టుకుని పండుగలకు పోయినట్టు.. ఊళ్లన్నీ హైదరాబాద్ రోడ్డెక్కుతున్నాయి! అందంగా అలంకరించిన వేలకొద్దీ ట్రాక్టర్లు.. లారీలు.. బస్సులు.. ఇతర వాహనాలు.. వాటినిండా వాడితగ్గని ఉద్యమ ఉత్సాహంతో 31 జిల్లాల నుంచి ప్రజలు ప్రగతి నివేదన సభాప్రాంగణాన్ని గులాబీమయం చేసేందుకు కొంగరకలాన్ బాటపట్టారు!.. మరోవైపు ప్రగతి నివేదన సభ ప్రారంభానికి ముందే ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు. కొంగరకలాన్ సభకు ముందు జరుగుతున్న ఈ క్యాబినెట్ సమావేశం అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నది. ప్రభుత్వానికి సంబంధించిన అత్యంత కీలకమైన నిర్ణయాలను ఈ సమావేశంలో తీసుకునే అవకాశం ఉందని సమాచారం. 

Don't Miss