ఏపీ రాష్ట్రంలో రైతాంగ సంక్షోభం - మధు..

రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చిన తరువాత రైతాంగ సంక్షోభం తీవ్రతరమైందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీపీఎం కార్యదర్శి పెనుమల్లి మధు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై టెన్ టివిలో 'వన్ టు వన్ శ్రీధర్ బాబు' కార్యక్రమంలో మధు పాల్గొని విశ్లేషించారు. రైతులకు రుణమాఫీ అమలు చేస్తామని చెప్పడంతో రైతులు ఆశగా ఎదురు చూశారని, అరకొర రుణమాపీ అమలయై..బ్యాంకులు లోన్లు ఇవ్వకపోవడంతో రైతులు ప్రైవేటు వడ్డీలపై ఆధారపడ్డారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రైతుల ఆత్మహత్యలు అధికమయ్యాయని, అనంతపురంలో 134 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. కొత్తగా రాష్ట్రం ఏర్పడిన తరువాత కార్మిక..దళితులు..భూ సమస్య..ప్రైవేటు రిజర్వేషన్లు..ఆర్థిక, సామాజిక అంశాలపై నిర్వహిస్తున్న ఉద్యమాలకు మంచి ఆదరణ వస్తోందని, మంచి ఆశాజనకంగా కనిపిస్తోందని తెలిపారు. మరిన్ని విశేషాల కోసం వీడియో చూడండి.
 

Don't Miss