కల్తీ కల్లు తాగి 15 మందికి అస్వస్థత

18:13 - April 15, 2018

నల్లగొండ : జిల్లాలోని గుర్రంపోడు మండలం పోచంపల్లిలో ఆదివారం ఉదయం కల్తీ కల్లు తాగి 15 మంది అస్వస్థతకు గురయ్యారు. కల్తీ కల్లు తాగిన కొద్దిసేపటికే వాంతులు కావడంతో నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అందులో ముగ్గురి పరిస్థతి విషమంగా ఉందని ఐసీయూలో ఉంచి వారికి చికిత్స అందిస్తున్నట్లు డాక్టర్లు తెలిపారు. మిగిత వారి ప్రాణాలకు ప్రమాదం లేదన్నారు. బాధితులను పరామర్శించిన కలెక్టర్ గౌరవ్‌  దీనికి సంబంధించిన బాద్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. 


 

Don't Miss