కాంగ్రెస్‌ నాయకులు ఎలాంటి తప్పు చేయలేదన్న కుంతియా

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ నుంచి కాంగ్రెస్‌ సభ్యులను సస్పెండ్‌ చేయడంపై ఏఐసీసీ స్పందించింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను సస్పెండ్‌ చేయడం దురదృష్టకరమన్నారు తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ కుంతియా. స్వామిగౌడ్‌పై కోమటిరెడ్డి వెంకటరెడ్డి దాడి చేశారనడం అవాస్తవమన్నారు. సభలో గందరగోళనం జరిగిన ఫుటేజి బయటపెట్టాలన్నారు. కాంగ్రెస్‌ నాయకులు ఎలాంటి తప్పు చేయలేదన్నారు. ప్రభుత్వ చర్యను ప్రజాస్వామ్యయుత పార్టీలన్నీ ఖండించాలన్నారు. కాంగ్రెస్‌ హయాంలో హరీష్‌రావు అసెంబ్లీలో వ్యవహరించిన  తీరు గుర్తు లేదా ? అని ప్రశ్నించారు. పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్‌ ఎంపీలు వెల్‌లోకి వెళ్లి గందరగోళం చేసినప్పుడు లేని తప్పు.. అసెంబ్లీలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఆందోళనలు చేస్తే వచ్చిందా అన్నారు. టీఆర్‌ఎస్‌ నేతలు తమను తాము ప్రజాస్వామ్యవాదులనుకోవడం ఆశ్చర్యం కలిగిస్తుందన్నారు. ఎమ్మెల్యేలను సస్పెండ్‌ చేసినంత మాత్రాన తమ ఆందోళనలు ఆగవని.... ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

Don't Miss