కాచిగూడ, కరీంనగర్ కు కొత్తరైలు..

హైదరాబాద్ : కాచిగూడ నుంచి జగిత్యాల మీదుగా కరీంనగర్ కు కొత్త రైలు ప్రారంభం కానుంది. ఈ నెల 15న రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ దీనిని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాచిగూడ నుంచి నిజామాబాద్, మెట్ పల్లి, కోరుట్ల, జగిత్యాల మీదుగా కరీంనగర్ ప్రతిరోజు ఈ రైలు నడవనుంది. ఈ రైలు తిరిగి ఇదే మార్గంలో కాచిగూడకు చేరుకుంటుందని రైల్వే శాఖాధికారులు చెప్పారు. కాగా, నిజామాబాద్ ఎంపీ కవిత గతంలో రైల్వే శాఖ మంత్రితో పాటు దక్షిణ మధ్య రైల్వే జీఎంకు ఈ మేరకు ఓ లేఖ రాశారు. ఈ లేఖ నేపథ్యంలో రైల్వే మంత్రిత్వ శాఖ ఎట్టకేలకు స్పందించడంతో కాచిగూడు-కరీంనగర్ మార్గంలో కొత్త రైలు రానుంది.

Don't Miss