కేటీఆర్ కు షాక్ ఇచ్చినా మహిళా

18:16 - February 2, 2018

సిరిసిల్ల : డబ్బు కోసం తల్లీ.. బిడ్డలే తన్నుకుచస్తున్న ఈరోజుల్లో.. ఓ పేద మహిళ ఇల్లు ఇస్తామంటే...వద్దంది. తనకన్న పేదవారు ఉన్నారని.. వారికిస్తే బాగుంటుందని.. మంత్రి కేటీఆర్‌నే ఆశ్చర్యపరించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా.. ముస్తాబాద్‌లో డబుల్ బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణాన్ని పరిశీలించేందుకు వెళ్లిన మంత్రి కేటీఆర్‌ను .. అక్కడ ఓ పూరి గుడిసెలో నివశిస్తున్న షరీఫా అనే మహిళ కలిసింది. తన సమస్యలను, ఇబ్బందులను కేటీఆర్‌కు చెప్పుకుంది. దీంతో కేటీఆర్‌.. ఆమెకు డబుల్ బెడ్‌ రూమ్‌ ఇప్పిస్తానని అన్నారు. అయితే షరీఫా.. తనకు ఇందిరమ్మ ఇళ్ల పథకంలో.. స్థలం వచ్చిందని అక్కడే గుడిసె వేసుకుని జీవిస్తున్నానని.. తనకు డబుల్‌ బెడ్‌ రూమ్‌ వద్దని..సున్నితంగా తిరస్కరించింది. తన కన్న బీదవారు చాలామంది ఉన్నారని.. వారికిస్తే.. బాగుపడతారని అంది. దీంతో మంత్రి కేటీఆర్‌తో సహా అక్కడున్నవారందరూ ఆశ్చర్యపోయారు. తన గుడిసెపైకి రేకులు ఇప్పిస్తే చాలని అనడంతో.. కేటీఆర్ ఆనందం వ్యక్తం చేస్తూ.. రేకులు వేయిస్తానని.. మాట ఇచ్చారు.ధనదాహంతో కుంభకోణాలకు పాల్పడే.. కోటీశ్వరుల ముందు.. తనకున్నదాంతో.. తృప్తిగా బతికే.. షరీఫాలాంటి వారు ఉండడం.. సమాజంలోని మంచి, చెడులకు సూచికనే చెప్పుకోవాలి. 

Don't Miss