చంద్రబాబు ప్రభుత్వం ద్వంద్వ వైఖరి : బాబురావు

విజయవాడ : ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ రేపు ఏపీలో బంద్ నిర్వహించనున్నారు. టీడీపీ, బీజేపీ మినహా బంద్ లో అన్ని పార్టీలు పాల్గొంటున్నాయి. బంద్ ను అడ్డుకునేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. విపక్షపార్టీల నేతలకు పోలీసులు నోటీసులు పంపారు. కేసులు నమోదు చేస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. పోలీసుల నోటీసులపై సీపీఎం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తోందని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బాబురావు విమర్శించారు. బంద్ లు వద్దని...20న ఎందుకోసం బాబు దీక్ష చేస్తానన్నారని ప్రశ్నించారు.

Don't Miss