జయనగర్ లో సౌమ్యారెడ్డి విజయం..

కర్ణాటక : జయనగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ పడ్డ మాజీ హోమ్ మంత్రి రామలింగారెడ్డి కుమార్తె సౌమ్యా రెడ్డి స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు. తొలుత 10 వేల ఓట్లకు పైగా ఆధిక్యంలోకి వెళ్లిన సౌమ్యారెడ్డికి, ఆపై రౌండ్లలో మెజారిటీ తగ్గుతూ రావడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఆందోళన కనిపించింది. చివరకు ఏమవుతుందా? అన్న టెన్షన్ నెలకొనగా, ఇంటికి వెళ్లిపోయిన బీజేపీ అభ్యర్థి బీఎన్ ప్రహ్లాద్ తిరిగి కౌంటింగ్ కేంద్రానికి వచ్చారు కూడా. చివరకు సుమారు 4 వేల ఓట్ల మెజారిటీతో సౌమ్యా రెడ్డి విజయం సాధించడంతో కాంగ్రెస్ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి. సౌమ్యారెడ్డికి 54,045 ఓట్లు రాగా, ప్రహ్లాద్ కు 50,270 ఓట్లు వచ్చాయి. ఈ గెలుపుతో కర్ణాటక కాంగ్రెస్ ఖాతాలోకి మరో సీటు వచ్చి చేరినట్లయింది.

Don't Miss