జర్నలిస్టులపై పోలీసుల నిర్బంధం

గుంటూరు : జిల్లాలో జర్నలిస్టులపై పోలీసులు దౌర్జన్యానికి దిగారు. హత్య కేసు కవరేజ్ కి వెళ్లిన జర్నలిస్టులను పోలీసులు నిర్బంధించారు. నిన్న ఉదయం విజయవాడలో కాళిదాసు అనే రౌడీ షీటర్ హత్య గావించబడ్డాడు. ఈ హత్య కేసులో ఇద్దరు అనుమానితులు తెనాలి కోర్టులో లొంగిపోయారు. లొంగుబాటు వార్త కవరేజ్ కు వెళ్లిన జర్నలిస్టులపై పోలీసులు దాష్టీకానికి పాల్పడ్డారు. కవరేజ్ చేయకుండా జర్నలిస్టులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల తీరుపై జర్నలిస్టు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పోలీసుల తీరును కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేలు మల్లికార్జునరావు, మస్తాన్ వలీ ఖండించారు. తక్షణమే జర్నలిస్టులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 

Don't Miss