డాక్టర్ శిల్ప ఆత్మహత్య కేసు సిట్ కు అప్పగింత..

చిత్తూరు : తిరుపతి ఎస్వీ మెడికల్‌ కాలేజీ పీజీ స్టూడెంట్, డాక్టర్‌ శిల్ప ఆత్మహత్య కేసు విచారణ బాధ్యతలను ఏపీ ప్రభుత్వం స్పేషల్‌ ఇన్వేష్టిగేషన్‌ టీం కు అప్పగించింది. ఆమె ఆత్మహత్య వెనుక ప్రొఫెసర్ల లైంగిక వేధింపులు ఉన్నాయన్న ఆరోపణలు రావడం కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. సిట్‌ అధికారిగా చిత్తూరు డీఎస్పీ రమణ కుమార్‌ ను నియమిస్తున్నట్టు ఉత్తర్వులు జారీ అయ్యాయి. కాగా, శిల్ప మృతికి కారణమైన ప్రొఫెసర్లపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ ను శిల్ప బంధుమిత్రులు కోరారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రూయా ఆసుపత్రి పీడియాట్రిక్ విభాగం హెచ్ఓడీ రవికుమార్ సహా మరో ఇద్దరిని ఇప్పటికే సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. 

Don't Miss