నాగ్ తో రాంగోపాల్ అద్భుతం చేయబోతున్నాడా..?

20:43 - November 24, 2017

28ఏళ్ల క్రితం తెలుగు తెరపై ఓ అద్భుతం ఆవిష్కృతమయింది. ఇప్పుడు మళ్లీ అదే క్రేజీ కాంబినేషన్ తో వస్తున్న సినిమా ఎలాంటి సంచనాలు క్రియేట్ చేస్తుంది? నాటి శివ రేంజ్ లో అద్భుతాలు సృష్టిస్తుందా? తెలుగు తెర దశ దిశను మారుస్తుందా? మరో మైలు రాయిగా మారుతుందా? తనకు మైండ్ దొబ్బింది కానీ.. ఇంకా గుజ్జు అయిపోలేదు అంటున్న వర్మ... ఎళాంటి సంచనాలు సృష్టించబోతున్నాడు? తెలుగు సినిమాపై చెరగని ముద్ర..బాలీవుడ్ ని కుదిపేసిన ఫిల్మ్ మేకర్.. ఇవన్నీ రొటీన్ మాటలు.. కానీ రామ్ గోపాల్ వర్మ... సినిమా వస్తుంది అంటే అతడి అభిమానులే కాదు.. విమర్శించే వాళ్లు కూడా ఆసక్తి చూపటం మాత్రం నిజం..ఇప్పుడు కూడా అదే సీన్ కనిపిస్తోంది.

పెద్ద నోట్లను కాదు.. వర్మ సినిమాలను రద్దు చేయాలి.. ఫేస్ బుక్ లో ఆ మధ్య కనిపించిన ఓ కామెంట్.. సినిమా ప్రకటించటంలో ఉన్న ఉత్సాహం తీయటంలో ఉండదు.. అని అసలు విషయాలను దాటవేసి పైపై మెరుగులకే ప్రాధాన్యం ఇస్తాడనే విమర్శ.. సంచలనాలకు ప్రాధాన్యమిచ్చే వర్మ.. టేకింగ్ లో అత్యంత జాగ్రత్తగా ఉండే వర్మ.. కథ విషయంలో మాత్రం పెద్దగా కేర్ తీసుకోవటం లేదని, వివాదం.. ప్రచారం.. సంచలనం.. ఊపిరిగా నడిచే వర్మ.. అంతిమంగా సినిమా విషయంలో బోల్తా కొడుతున్నాడనే వాదనలు.. వీటన్నిటి మధ్య... వర్మ ఫ్యాక్టరీ నుంచి మరో ప్రాడక్డ్ రాబోతోంది..

అంతా ప్రచారం కోసమే చేస్తున్నాడు అనిపిస్తాడు. వార్తల్లో ఉండటానికే ఈ హడావుడి అనేలా చేస్తాడు.. కానీ, వర్మ ఉన్నట్టుండి కళ్లు చెదిరే ఓ సినిమా వదులుతాడు.. గతాన్ని మరచి ప్రేక్షకులతో చప్పట్లు కొట్టించుకుంటాడు. మళ్లీ కొన్ని ఫ్లాప్ సినిమాలు. వివాదాల ట్వీట్లు.. సంచలనాల ప్రకటనలు.. వెరసి వర్మ అంటే ఎప్పటికీ ఓ సంచలనమే. నా ఇష్టం.. నేను తీసేది తీస్తా.. మీకు నచ్చితే చూడండి లేదంటే లేదు..ఇదే లాస్ట్ సినిమా మళ్లీ తీయను..నా మాట మీద నేను నిలబడను..ఈ సారి నామీద నేనే ఒట్టేసుకుంటున్నాను..నేను మీరనుకున్నంత వెధవను కాను. నాకు మైండ్ దొబ్బంది కానీ, జ్యూస్ అయిపోలేదు.. ఇవీ వివాదాల వర్మ వ్యాఖ్యలు.. ఇప్పుడు నాగ్ తో చేస్తున్న లేటెస్ట్ సినిమా ఎలాంటి సంచనాలు క్రియేట్ చేయబోతోంది? శివ రేంజ్ లో చరిత్ర సృష్టించగలదా?ఇదీ ఈ రోజు వైడాంగిల్ స్టోరీ.. తర్వాతి ఎపిసోడ్ లో మరో అంశంపై విశ్లేషణాత్మక కథనం చూద్దాం..

 

 

 

 

 

Don't Miss