పంచాయతీ రిజర్వేషన్లపై ముగిసిన సమావేశం...

హైదరాబాద్ : పంచాయతీ రిజర్వేషన్లపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ ముగిసింది. అడిషనల్ అడ్వకేట్ జనరల్, న్యాయనిపుణులు పాల్గొన్నారు. షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని భావించడం జరిగిందని ఆర్థిక మంత్రి రాజేందర్ పేర్కొన్నారు. కొన్ని శక్తులు కోర్టుకెళ్లి అడ్డుకున్నారని, 2 నుండి కొత్తపాలక మండళ్లా ? స్పెషల్ ఆఫీసర్ల పాలనా అనేది సీఎం కేసీఆర్ నిర్ణయిస్తారని తెలిపారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లను సాధిస్తామని తెలిపారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లను ఇవ్వాలని కేంద్రాన్ని కోరడం జరిగిందని, హై కోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని వెల్లడించారు. హైకోర్టు ఆదేశాను సారం వెళితే ఇప్పుడున్న రిజర్వేషన్ల సంఖ్య కూడా తగ్గే ప్రమాదం ఉందన్నారు. 

Don't Miss