పాతబస్తీలో వెయ్యి కోట్లతో మౌలిక సదుపాయాలు : సీఎం కేసీఆర్

22:03 - April 16, 2018

హైదరాబాద్ : పాతబస్తీలో వేయి కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. ఇవాళ ప్రగతిభవన్‌లో అధికారులతో ఆయన సమావేశమయ్యారు. మైనార్టీ వ్యవహారాలు, పాతబస్తీ సంబంధిత అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి సీఎస్ ఎస్‌కే జోషి, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, అధికారులు హాజరయ్యారు. పాతబస్తీలో అభివృద్ధిపనులకు తానే శంకుస్థాపన చేసి యుద్ధ ప్రాతిపదికన పనులు జరిపిస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు. రంజాన్ నెల ప్రారంభానికి ముందే పాతబస్తీలో పర్యటించి అభివృద్ధి పనుల ప్రకటన చేస్తామని సీఎం తెలిపారు. వరదలకు ఆస్కారం లేకుండా పాతబస్తీని తీర్చిదిద్దేందుకు ప్రణాళిక రూపొందించాలన్నారు. మూసీ ప్రక్షాళనకు 1600కోట్లు ఖర్చు చేస్తామని కూడా కేసీఆర్ తెలిపారు. 

 

Don't Miss