'ప్రగతి నివేదన' టోల్ ట్యాక్స్ లేదు...

హైదరాబాద్ : టీఆర్ఎస్ నిర్వహించే 'ప్రగతి నివేదన' సభకు భారీ ఏర్పాట్లు చేశారు. కొంగరకలాన్ లో ఆదివారం భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కనీవినీ ఎరుగని రీతిలో బహిరంగసభ నిర్వహించాలని పార్టీ అధినాయకత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. గత నాలుగేళ్ల కాలంలో ప్రభుత్వం చేసిన..చేస్తున్న ప్రగతిని సభలో వివరించనున్నారు. ఈ సందర్భంగా సభకు వెళ్లే మార్గాలన్నీ అందంగా 'గులాబీ' తోరణాలు..ఫ్లెక్సీలతో అలంకరించారు. నాగోల్ లో స్థానిక నేతలు పలు ఏర్పాట్లు చేశారు. బహిరంగసభకు వెళ్లే వారికి స్వాగతం పలికేందుకు స్వాగత వేదిక...ఆహారం..మంచినీరు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా సభకు వెళ్లే వారికి టోల్ ట్యాక్స్ చెల్లించాల్సినవసరం లేదని..ఇందుకు అధికారులు కూడా నిర్ణయం తీసుకున్నారు. 

Don't Miss