బీజేపీ మతోన్మాదాన్ని ఎండగడతాం : తమ్మినేని

హైదరాబాద్ : బీజేపీ మతోన్మాదం కేవలం రాజకీయరంగంలోనే కాదు... కల్చరల్ రంగంలోనూ ప్రభావం ఎక్కువగా ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. పొత్తు వివిధ పార్టీలతో కాదని..ప్రజలతో పెట్టుకోవాలన్నారు. బీజేపీ మతోన్మాదాన్ని ప్రజల్లో ఎండగట్టడానికి పూనుకోవాలని తెలిపారు. సుస్థిరమైన విధానాలు లేకుండా రాజకీయ అవసరాల కోసం ఏర్పడే ఫ్రంట్ లో తాము చేరబోమని చెప్పారు. థర్డ్ ఫ్రంట్, ఫెడరల్ ఫ్రంట్ లలో చేరేందుకు సీపీఎం సిద్ధంగా లేదన్నారు. గతంలో ఇలాంటి అవకాశవాద ఫ్రంట్ లను చాలా చూశామని తెలిపారు. కేసీఆర్, చంద్రబాబు విధానాల్లో అవకాశవాదం కన్పిస్తుందన్నారు. అఖిల భారతస్థాయిలో ప్రాంతీయ పార్టీలతో ఫ్రంట్ ఏర్పాటు తమ విధానం కాదన్నారు. లెఫ్ట్ ఫ్రంట్ బలపడటానికి ఈ మహాసభలు తోడ్పడతాయన్నారు. చివరి రోజు జరుగనున్న బహిరంగ సభ రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పు సూచిస్తుందన్నారు.  

 

Don't Miss