భర్త ఇంటి ముందు భార్య ఆందోళన

16:31 - April 15, 2018

పశ్చిమగోదావరి : జిల్లాలోని తాడేపల్లిగూడెం ఎఫ్ సీఐ కాలనీలో నారాయణరావు అనే రిటైర్డ్‌ ఆర్మీ ఉద్యోగి ఇంటి ముందు సూర్యవతి అనే మహిళ ఆందోళన చేపట్టింది. పదేళ్ల క్రితం తనను దొంగ పెళ్లి చేసుకొని పొలం, బంగారం, డబ్బు కాజేసి రోడ్డుపాలు చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. తనలాగే తాడేపల్లిగూడెం మండలంలోని పలు గ్రామాలకు చెందిన మరికొంత మంది మహిళలను కూడా నారాయణ వంచించి మోసగించాడని.. పోలీసులు తక్షణమే అతన్ని అరెస్ట్‌ చేయాలంటూ డిమాండ్‌ చేసింది.

Don't Miss