మాజీ ఎమ్మెల్యే వగ్గెల మిత్రసేన కన్నుమూత..

ఖమ్మం : అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే వగ్గెల మిత్రసేన కన్నుమూశారు. హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మిత్రసేన తుదిశ్వాస విడిచారు. రెండు కిడ్నీలు చెడిపోవడంతో గత నెల 28న మిత్రసేన నిమ్స్‌లో చేరారు. 2009 నుంచి 2014 వరకు అశ్వారావుపేట ఎమ్మెల్యేగా మిత్రసేన సేవలందించారు. 2009లో కొత్తగా ఏర్పడిన అశ్వారావుపేట నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా మిత్రసేన విజయం సాధించారు. మిత్రసేన స్వస్థలం అశ్వారావుపేట మండలం సున్నంబట్టి గ్రామం. మిత్రసేన మృతితో సున్నంబట్టిలో విషాదఛాయలు అలుముకున్నాయి. మిత్రసేన కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.

Don't Miss