రెండు ఫ్యామిలీ మధ్య టెక్నాలజీ చిచ్చు...

విజయవాడ : టెక్నాలజీ రెండు కుటుంబాల మధ్య పంతాలకు దారితీసింది. కనెక్షన్‌ మేనేజర్‌ అనే యాప్‌ పెళ్లి కొడుకు, పెళ్లి కూతురుల మధ్య చిచ్చు పెట్టింది. పళ్లి కూతురుకు తెలియకుండా వరుడు నాగశ్రీను ఆమె మొబైల్‌లో యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేశాడు. యాప్‌ పెళ్లి కూతురు ఎవరితో మాట్లాడుతుందో.. ఎక్కడ ఉందో.. ఎంత టైమ్‌ వరకు చాట్‌ చేస్తుందో తెలుసుకున్నాడు. విషయం తెలుసుకున్న యువతి నాగశ్రీనుతో మాట్లాడటం మానేసింది. యువతి కుటుంబ సభ్యులు పెళ్లికి ముందే అనుమానిస్తే పెళ్లి తర్వాత రక్షణ ఏమిటని నాగశ్రీనును, అతని కుటుంబ సభ్యులను ప్రశ్నించారు. మరోవైపు బాధితురాలు నాగశ్రీనుపై తోట్లవల్లూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్లి జరగాలంటే జూన్‌ 22 నుంచి మాట్లాడిన కాల్స్‌ రికార్డ్‌, మెడికల్‌ రిపోర్ట్‌ కావాలని నాగశ్రీను పోలీసులను కోరాడు. దీంతో ఆగ్రహించిన బాధితురాలు నాగశ్రీనుపై, కుటుంబసభ్యులపై కేసు పెట్టింది. తనకు న్యాయం జరిగే వరకు ఇక్కడే ఉంటానంటూ పోలీసుస్టేషన్‌ ముందు ఆందోళనకు దిగింది. 

Don't Miss