'రేపిస్టులను ఉరి తీసేందుకు 'తలారీ'నవుతా : ఆనంద్ మహేంద్రా

ఢిల్లీ: ముక్కుపచ్చలారని చిన్నారులపై ఇటీవల చోటుచేసుకుంటున్న అకృత్యాలపై పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బాలికలను బలిగొంటున్న రేపిస్టులు, హంతకులను ఉరితీసేందుకు తాను తలారి అవతారం ఎత్తేందుకు కూడా సిద్ధమని ప్రకటించారు. క్రూరంగా అత్యాచారం చేసి, చిన్నారుల ఉసురు తీస్తున్న రేపిస్టులు, హంతకులను ఉరితీసేందుకు నేను స్వచ్ఛందంగా తలారి పని చేయాలనుకుంటునని ట్విట్టర్ లో పేర్కొన్నారు. ప్రత్యేకించి గుజరాత్‌లోని సూరత్‌లో ఓ బాలిక మృతదేహంపై 86 గాయాలున్నట్టున్న విని ఆయన తీవ్ర ఆవేదనకు, కలవరానికి గురయ్యారు. మౌనంగా వుండటానికి తాను ఎంతో కష్టపడతాననీ..ప్రస్తుతం దేశంలో జరుగుతున్న దారుణాలను చూసి నా రక్తం మరిగిపోతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Don't Miss