రైతులకు అధిక ప్రాధాన్యత : మంత్రి ఈటల

17:45 - April 15, 2018

వరంగల్‌ రూరల్‌ : దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు మంత్రి ఈటల రాజేందర్‌. వరంగల్‌ రూరల్‌ జిల్లా వర్ధన్నపేట మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్‌ ఆఫీసులో సబ్సిడీ ట్రాక్టర్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. రైతుల రుణమాఫీ, రుణ ముక్తి సర్టిఫికేట్‌ అందించేందుకు కేంద్రం పరిహారం అందించకపోయినా నాలుగు విడతలుగా 17వేల కోట్ల రుణాలు మాఫీ చేశామన్నారు. 

Don't Miss