లేపాక్షి చెరువుకు చేరుకున్న కృష్ణా జలాలు

20:10 - April 15, 2018

అనంతపురం : జిల్లాలోని హిందూపురం నియోజకవర్గంలోని లేపాక్షి పెద్ద చెరువుకు గొల్లపల్లి రిజర్వాయర్ నుండి కృష్ణా జలాలు చేరుకోవడంతో ప్రజలు జలహారతి చెపట్టారు. వైసీపీ దృష్టిలో రాజీనామా అంటే కేంద్రంతో రాజీ... ఏపీకి నామాలు పెట్టడమేనని మంత్రి దేవినేని ఉమా ఎద్దేవా చేశారు. జగన్‌కు ఆరుతడి లెక్కలు తెలియవు కానీ తప్పుడు లెక్కలు చేసి జైలుకు వెళ్ళడం మాత్రం తెలుసని విమర్శించారు. గొల్లపల్లి రిజర్వాయర్ నుండి ప్రత్యేక పైప్‌ లైన్‌ ద్వారా జూన్‌ కల్లా హిందూపురం ప్రజల దాహార్తిని తీరుస్తామని ఎమ్మెల్యే బాలకృష్ణ  హామీఇచ్చారు.

Don't Miss