సత్వరం న్యాయం చేయాలి : సుప్రీంకోర్టు

విశాఖ : జిల్లాలోని వాకపల్లి ఆదివాసి మహిళలపై జరిగిన అత్యాచారం కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో అపరిమిత జాప్యం జరిగినందుకు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన కోర్టు నిందితులైన 13 మంది గ్రేహౌండ్స్ పోలీసులపై విచారణ జరిపి తీరాలని ఆదేశించింది. పోలీసులు వేసిన క్వాష్ పిటిషన్‌ను జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ శాంతానా గౌండర్‌లతో కూడిన ధర్మాసనం కొట్టివేసింది. సంబంధిత ట్రయల్ కోర్టు ఈ కేసు విచారణను 6 నెలలలోపు పూర్తి చేసి సత్వరం న్యాయం చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 2007 ఆగస్టు 20న 21 మంది గ్రేహౌండ్స్ పోలీసులు వాకపల్లికి చెందిన 11మంది ఆదివాసీ స్త్రీలపై అత్యాచారానికి పాల్పడ్డారు. స్ధానిక ఎమ్మెల్యే సహకారంతో బాధిత మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సబ్ కలెక్టర్ ఆదేశాలతో 21 మంది పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదైంది. అప్పటి నుంచి బాధిత మహిళలు న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నారు. 11 మందిలో ఇద్దరు చనిపోయారు. 

Don't Miss