సాగునీరు అడిగిన రైతులను నక్సలైట్లలా చూస్తున్నారు : జెట్పీసీలు

నిజామాబాద్ : పంటలు వేసిన రైతులు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుండి నీటిని విడుదల చేసి తమ పంటలను కాపాడాలని వేడుకుంటున్న ఎస్సారెస్పీ పరిధిలోని రైతులను ప్రభుత్వం నక్సలైట్లలా చూస్తోందని ఆరోపించారు. సాగునీరు కోసం ఆందోళన చేస్తున్న రైతులపై ప్రభుత్వం పోలీసులను ప్రయోగిస్తోందని ఆరోపించారు. వెంటనే రైతులకు ఎస్సారెస్పీ నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాగా సాగునీటి కోసం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పరిధిలోని రైతులు ఆందోళన బాట పట్టిన విషయం తెలిసిందే.. నీరు విడుదల చేయకపోగా ఆ ప్రాంత పరిధిలో పోలీసులు భారీగా మోహరించి 144 సెక్షన్ కూడా విధించిన విషయం తెలిసిందే. నీటీకోసం రైతులు ఆందోళన చేస్తే పోలీసులతో అరెస్ట్ చేయించటం ఎంతవరకూ సమంజసం అని జెట్పీసీలు ప్రశ్నిస్తున్నారు. 

Don't Miss