సాయికిరణ్‌ ను హంతకునిగా గుర్తించాం : సీపీ సందీప్ శాండిల్య

హైదరాబాద్ : ఇంటర్ విద్యార్థిని చాందిని జైన్ హత్య కేసులో సాయికిరణ్‌ను అరెస్టు చేసినట్లు సైబరాబాద్ సీపీ సందీప్ శాండిల్య తెలిపారు. శనివారం చాందిని అదృశ్యమైనట్లు ఫిర్యాదు అందిందని.. వెంటనే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. కాల్‌డేటా, స్నేహితుల వివరాలు, సీసీ ఫుటేజీలను పరిశీలించి సాయికిరణ్‌ ను హంతకునిగా గుర్తించామన్నారు. సాయికిరణ్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా హత్య చేసినట్లు ఒప్పుకున్నాడని తెలిపారు. చాందినిపై లైంగిక దాడి జరగలేదని... పోస్టుమార్టమ్ నివేదిక ఇంకా రావాల్సి ఉందన్నారు. చాందిని, సాయి కిరణ్ ఇద్దరు మైనర్లేనని సీపీ తెలిపారు. పిల్లలు సోషల్ మీడియా వాడే సమయంలో... తల్లిదండ్రులు.. అప్రమత్తంగా ఉండాలని సీపీ సూచించారు. 

 

Don't Miss