సిరియాలో అమెరికా వైమానిక దాడులపై ప్రజల ఆగ్రహం

18:44 - April 15, 2018

అమెరికా : సిరియాలో అమెరికా వైమానిక దాడులపై ఆ దేశం ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యుద్ధం వద్దంటూ.. శాంతి ప్రేమికులు వైట్ హౌస్ ముందు నిరసన ప్రదర్శన నిర్వహించారు. అమెరికా, దాని మిత్ర దేశాల దాడులకు అమాయక ప్రజలు బలైపోవడం బాధాకరమన్నారు. అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికైనా.. సిరియాపై దాడులను ఆపేలా ఆదేశాలు జారీచేయాలని వారు డిమాండ్ చేశారు. సిరియా రసాయన ఆయుధాలు ప్రయోగిస్తుందని ఆరోపిస్తూ.. శుక్రవారం రాత్రి నుంచి అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ వైమానిక దాడులు చేపట్టాయి.

 

Don't Miss