బ్రేకింగ్ న్యూస్.. టీజేఎస్‌కు 11 సీట్లు కేటాయించిన కాంగ్రెస్

15:50 - November 6, 2018

హైదరాబాద్: కోదండరామ్ ఆధ్వర్యంలో ఆవిర్భవించిన తెలంగాణ జనసమితి కీలక ప్రకటన చేసింది. మహాకూటమిలో భాగస్వామ్యం అయిన తమ పార్టీకి కాంగ్రెస్ 11 సీట్లు కేటాయించిందని టీజేఎస్ ప్రకటించింది. కాంగ్రెస్ కేటాయించిన ఆ స్థానాలను సైతం టీజేఎస్ ప్రకటించింది. కాగా రామగుండం నుంచి కోదండరామ్ పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

టీజేఎస్‌కు కేటాయించిన స్థానాలు
1 మెదక్ జనార్దన్‌రెడ్డి
2 దుబ్బాక రాజ్‌కుమార్
3 మల్కాజ్‌గిరి దిలీప్‌కుమార్
4 వరంగల్ ఈస్ట్ గాదె ఇన్నయ్య
5 సిద్ధిపేట భవానీ రెడ్డి
6 చాంద్రాయణగుట్ట జబరుద్దీన్
7 మిర్యాలగూడ  
8 రామగుండం  
9 ఆసిఫాబాద్  
10 చెన్నూరు  
11 వర్ధన్నపేట  

 

టీఆర్ఎస్‌ను ఓడించడమే లక్ష్యంగా కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ కలిసి మహాకూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ 95 స్థానాల్లో పోటీ చేయనుండగా, టీడీపీ 14 స్థానాల్లో పోటీ చేయనుందని సమాచారం. ఇక సీపీఐకి కేవలం మూడు స్థానాలు మాత్రమే కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది. మరో రెండు ఎమ్మెల్సీ పదవులు ఇస్తామని కాంగ్రెస్ వారికి హామీ ఇచ్చిందని సమాచారం. ఈ నెల 8న లేదా 9న మహాకూటమి అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారని వార్తలు వస్తున్నాయి.

 

Don't Miss