అందరి ఛాయిన్ 2.O : అడ్వాన్స్ బుకింగ్స్ లో బాహుబలి తుస్సు

13:57 - November 29, 2018

దేశవ్యాప్తంగా రజినీ మానియా నడుస్తోంది. మూవీ టాక్ కూడా బాగుండటంతో.. 2.ఓకి అడ్వాన్స్ బుకింగ్స్ అదరగొడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 6,800 థియేటర్లలో.. 10వేల స్ర్కీన్స్ పై ఈ మూవీ రిలీజ్ అయ్యింది. ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ రావటం, పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారని చూసిన వారు అభిప్రాయం వ్యక్తం చేయటంతో.. టికెట్ల బుకింగ్ ఊపందుకుంది. నెల రోజులుగా పెద్ద సినిమాలు ఏమీ లేవు.. చిన్న సినిమాలు కూడా ఆకట్టుకోలేదు.. ఈ టైంలో వచ్చిన 2.ఓ మూవీకి అడ్వాన్స్ బుకింగ్స్ అనూహ్యంగా పెరిగాయి.
పేటీఎం రికార్డ్ బద్దలు :
paytm నుంచి 2.ఓ మూవీ టికెట్ల బుకింగ్స్ అదరహో అనిపించాయి. కేవలం ఈ యాప్ నుంచే 13 లక్షల టికెట్లు బుక్ అయ్యాయి. బుక్ మై షో ద్వారా మరో 10 లక్షల టికెట్లు బుక్ అయ్యాయి. పీవీఆర్ తోపాటు ఇతర మల్టీఫ్లెక్స్ యాప్స్, వెబ్ సైట్స్ నుంచి 3 లక్షల టికెట్లు బుక్ అయ్యాయి. ఓవరాల్ లో ఆన్ లైన్ ద్వారా అడ్వాన్స్ బుకింగ్ ద్వారా 2.ఓ మూవీ దేశ వ్యాప్తంగా 30 లక్షల టికెట్ల వరకు ఉన్నారు. దేశంలో ఏ సినిమాకు ఈ స్థాయిలో డిమాండ్ రాలేదంటున్నాయి ఆయా యాప్ నిర్వహకులు. ఇదే ఇప్పటి వరకు రికార్డ్ అంటున్నారు. 
అడ్వాన్స్ బుకింగ్స్ లో రికార్డ్స్ :
గురువారం రిలీజ్ కావటంతో వీకెండ్ ఫ్యామిలీలకు కలిసివచ్చింది. రెండు రోజులు ఫ్యాన్స్ హడావిడి కంప్లీట్ అవుతుంది.. ఆ తర్వాత ఫ్యామిలీస్ వస్తారు. 2.ఓకి వచ్చేసరికి వీకెండ్ అంతా ఫ్యామిలీస్ బుకింగ్ జరిగింది. మల్టీఫ్లెక్సులు, ఇతర ధియేటర్లలో కనీసం 3-4 టికెట్ల అడ్వాన్స్ బుకింగ్ కనిపించింది. ఇదికూడా భారీ కలెక్షన్స్ కు అవకాశం ఏర్పడింది. ఓవరాల్ లో అడ్వాన్స్ బుకింగ్స్ 2.ఓ సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. తమిళంలోనే కాకుండా తెలుగు, హిందీ భాషల్లోనే ఇదే ఊపు కనిపిస్తోంది. ఇది ఏ స్థాయిలో ఉంది అంటే.. బాహుబలి రికార్డ్ కూడా తుడిచిపెట్టుకుపోయింది.

Don't Miss