2.ఓ మానియా : సెల్ ఫోన్లతో ఆటో డెకరేషన్

13:11 - December 1, 2018

రజినీకాంత్ సినిమా మానియా ఎలా ఉంటుందో.. అభిమానులు ఏ రేంజ్ లో  పండగ చేసుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే వెరైటీ అనేది ఇక్కడ పాయింట్. 2.ఓ మూవీ రిలీజ్ తో.. చెన్నైలోని ఆటోలను డిఫరెంట్ గా డెకరేట్ చేశారు డ్రైవర్. ఓ ఆటోవాలా అయితే.. ఆటో మొత్తాన్ని బొమ్మ సెల్ ఫోన్లు, తుపాకీలతో నింపేశాడు. మూవీలో రజినీ ఎలాంటి గెటప్ లో అయితే ఉంటాడో.. అదే తరహాలో అతను ఆటోను తీర్చిదిద్దాడు.
చెన్నైలో సిటీలో చక్కర్లు :
2.ఓ మూవీ రిలీజ్ సందర్భంగా.. ఈ తరహా డెకరేషన్ చేసిన ఆటోవాలా.. అన్ని ధియేటర్ల దగ్గరకు తిరిగాడు. దీన్ని ఈ ఆటోను చూసిన ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఆ ఆటోలో ఎక్కటానికి పోటీ పడ్డారు. మరో వారం రోజులు ఇదే విధంగా ఆటో నడుపుతానని చెబుతున్నాడు. ఆటో ఎక్కిన వారు మీటర్ కంటే కొంచెం ఎక్కువే ఇస్తున్నారని కూడా చెబుతున్నాడు ఆటోవాలా. 

Don't Miss