70 ఏళ్ల 'మిస్ గ్రానీ'గా సమంతా?!..

13:07 - August 3, 2018

సమంతా..తెలుగులో సూపర్, డూపర్ హిట్ హీరోయిన్..సాధారణంగా హీరోయిన్స్ అంటే ముఖ్యంగా తెలుగులో కేవలం గ్లామర్ కు మాత్రమే పరిమితంగా నిలిచిపోతుంటారు. కానీ సమంతా అలా కాదు..కేవలం గ్లామర్ చట్రంలోనే ఇరుక్కుపోలేదు. విభిన్నమైన కథలను .. పాత్రలను ఎంచుకుంటూ సమంత వరుస విజయాలతో తన మార్క్ ను నిలబెట్టుకుంటోంది. అంతేకాదు టాలీవుడ్ లో అగ్ర సంస్థ, అగ్రహీరోలు వున్న కుటుంబానికి ముద్దుల కోడలు కూడాను. అలాంటి సమంత మరో వైవిధ్యభరితమైన కథాంశానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా ఫిల్మ్ నగర్లో టాక్ పక్కాగా వినిపిస్తోంది.

'మిస్ గ్రానీ'కి రీమేక్ లో సమంతా..
దర్శకురాలు నందినీ రెడ్డి .. సమంతకు మధ్య కొన్ని రోజులుగా కథా చర్చలు జరుగుతున్నాయట. 2014లో వచ్చిన కొరియన్ మూవీ 'మిస్ గ్రానీ'కి రీమేక్ అని అంటున్నారు. ఈ సినిమాలో ప్రధాన పాత్రధారి 70 ఏళ్ల వృద్ధురాలిగా కనిపిస్తూ ఉంటుంది. అతీత శక్తులను కలిగిన ఆమె అవసరమైనప్పుడు యవ్వనవతిగా మారిపోతూ ఉంటుందట. అటువంటి పాత్రలో సమంతను చూపించాలనే ఉద్దేశంతోనే నందినీ రెడ్డి ఉన్నారట. కొత్తదనంతో కూడిన పాత్రలనే ఎక్కువగా చేస్తానని ఇటీవలే చెప్పిన సమంత, ఈ సినిమా చేసే ఛాన్స్ ఉందనే అభిప్రాయాలు సినీ పరిశ్రమ వర్గాల భోగట్టా..

Don't Miss