జాక్‌పాట్‌ కొట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌.....

09:21 - May 27, 2016

అమెరికా : డోనాల్డ్‌ ట్రంప్‌ జాక్‌పాట్‌ కొట్టాడు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్ధిగా బరిలో నిలిచేందుకు అవసరమైన మేజిక్‌ ఫిగర్‌ను సాధించారు. ఇందుకోసం 1237 మంది ప్రతినిధుల మద్దతు కావాల్సి ఉండగా... ఇప్పటి వరకు 16 మంది రిపబ్లికన్‌ అభ్యర్ధులను ఓడించి 1239 మంది మద్దతు కూడగట్టారు. క్లీవ్‌లాండ్‌ ప్రైమరీ ఎన్నికల్లో విజయంతో ఈ మైలురాయిని అధిగమించారు. వచ్చే నెల 7న మరో ఐదు రాష్ట్రా పాథమిక ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ట్రంప్‌ మద్దతదార్లు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ రాష్ట్రాల నుంచి మరో 303 మంది ప్రతినిధులను ఎనుకోవాల్సి ఉంది. జూన్‌ 16 జరిగే రిపబ్లికన్‌ పార్టీ జాతీయ మహాసభల్లో డోనాల్డ్‌ ట్రంప్‌ అభ్యర్ధిత్వాన్ని అధికారికంగా ప్రకటిస్తారు. ఈ ఏడాది నవంబర్‌ 8న జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ఈయన డెమాక్రాటిక్‌ పార్టీ అభ్యర్ధి హిల్లరీ క్లింటన్‌తో ఢీ కోనడం ఒక్కటే మిగిలివుంది. న్యూయార్క్‌ రియల్టరైన డోనాల్డ్‌ ట్రంప్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ మీడియాలో పతాక శీర్షికలకు ఎక్కారు. ముస్లింలను అమెరికా రానీయకుండా చేస్తానంటూ చేసిన ప్రకటక తీవ్ర విమర్శలకు దారితీయడంతో కొద్దిగా వెనక్కితగ్గారు. భారతీయుపైనా నోరు పారేసుకున్నారు. అమెరికన్లకు ఉపాధి కల్పించేందుకు యూఎస్‌లో భారీతీయులకు ఉద్యోగాలు లేకుండా చేస్తానని హెచ్చరించి విమర్శలు కొని తెచ్చుకున్నారు. బరాక్ ఒబామా ద్వారా డెమాక్రట్ల పాలనకు రెండుసార్లు అవకాశం ఇచ్చిన అమెరికన్లు ఈసారి రిపబ్లికన్లకు చాన్స్‌ ఇస్తారని భావిస్తున్నారు. దీంతో ట్రంప్‌ను అడ్డుకునే నాథుడే లేడని పరిశీలకులు చెబుతున్నారు.

Don't Miss