మానవీయ తెలంగాణ రావాలి - హరగోపాల్...

స్వర్ణాంధ్రప్రదేశ్ అని చంద్రబాబు అన్నా..బంగారు తెలంగాణ అని కేసీఆర్ అన్నా బంగారం అంత పనికి రాని మెటెల్ ఇంకోటి లేదని సామాజిక విశ్లేషకులు ప్రొ.హరగోపాల్ వ్యాఖ్యానించారు. విద్యార్థి, విద్యావేత్త, పౌర హక్కుల నాయకుడిగా ఎలా మారారు ? ప్రత్యేక తెలంగాణలో ప్రభుత్వ ప్రాధాన్యాతలు ఎలా ఉన్నాయి ? అనే అంశాలపై టెన్ టివిలో 'వన్ టు వన్ శ్రీధర్ బాబు' కార్యక్రమంలో ప్రొ.హరగోపాల్ పాల్గొని విశ్లేషించారు. బంగారు తెలంగాణ వద్దు..మానవీయ తెలంగాణ..ప్రజాస్వామ్య తెలంగాణ కావాలన్నారు. మనిషి..మనిషి జీవించే తెలంగాణ తీసుకరావాలన్నారు. బంగారు తెలంగాణ..స్వర్ణాంధ్రప్రదేశ్ అనే కాన్సెప్ట్ లో మనిషి లేడని తెలిపారు. 

Don't Miss