గెలుపుతో బాధ్యత పెరిగింది... పసునూరి

వరంగల్ ఉప ఎన్నికల్లో విజయం సాధించడంతో తమ మరింత బాధ్యత పెరిగిందని టీఆర్ ఎస్ ఎంపీ పసునూరి దయాకర్ అన్నారు. వన్ టు వన్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేసీఆర్ నాయకత్వంపై ప్రజలకు నమ్మకం ఉన్నది.. కాబట్టి భారీ మెజారిటీ వచ్చిందన్నారు. పార్టీలో మామూలు కార్యకర్తలకు కూడా గౌరవం కల్పించారని తెలిపారు. ఎన్నికల ముందు చేసిన వాగ్ధానాలను కేసీఆర్ పూర్తిగా అమలు చేశారని పేర్కొన్నారు. మొదటి నుంచి తెలంగాణ సాధనే లక్ష్యంగా పని చేశానని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనే అవకాశం దొరకడం అదృష్టంగా భావించానని చెప్పారు. ఏ భాద్యత ఇచ్చినా కమిట్ మెంట్ గా చేయాలని అనుకున్నానని పేర్కొన్నారు. గతంలో అవకాశం వచ్చి పోయిందని.. అయినా నిరుత్సాపడలేదన్నారు. వరంగల్ బైపోల్ ఎన్నికల సందర్భంగా కేసీఆర్ తనను పిలిచి.... ఎంపీ సీటు ఇచ్చారని వివరించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

Don't Miss