పోలింగ్ డే: ఓటు హక్కు వినియోగించుకున్న అల్లు అర్జున్

08:11 - December 7, 2018

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతోంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. అటు రాజకీయ నాయకులు కూడా పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టారు. ఇటు సినీతారలు సైతం ఓటు వేసేందుకు తరలివస్తున్నారు. జూబ్లీహిల్స్ బీఎస్ఎన్ఎల్ కార్యాలయం పోలింగ్ బూత్‌లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయం 8గంటలకు పోలింగ్ కేంద్రానికి వచ్చిన అల్లు అర్జున్ సాధారణ వ్యక్తుల్లా క్యూలో నిలబడ్డారు. తన వంతు వచ్చే వరకు వేచి ఉన్నారు. అనంతరం తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. సినీరచయిత పరుచూరి గోపాలకృష్ణ ఫిలింనగర్ క్లబ్‌లో ఉదయం 7గంటలకే ఓటు వేశారు.

Don't Miss