ఓ మోస్తరుగా అనిపించే అమర్ అక్బర్ ఆంటొని

14:28 - November 16, 2018

మాస్‌ మహారాజా రవితేజ, శ్రీనువైట్ల, కాంబినేషన్‌లో, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై, నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్ (CVM)  నిర్మిస్తున్న సినిమా.. అమర్ అక్బర్ ఆంటొని. టచ్ చేసిచూడు, నేలటికెట్ వంటి రెండు డిజాస్టర్ల తర్వాత, రవితేజకి.. ఆగడు, బ్రూస్‌లీ, మిస్టర్ లాంటి హ్యాట్రిక్ డిజాస్టర్ల ఇచ్చిన  శ్రీనువైట్లకి అమర్ అక్బర్  ఆంటొని సక్సెస్ చాలా అవసరం. ఇలాంటి పరిస్ధితుల్లో, భారీ అంచనాల మధ్య ఈరోజు రిలీజైన అమర్ అక్బర్ ఆంటొని ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో చూద్దాం..
కథ :


అమెరికాలో స్ధిరపడ్డ రెండు తెలుగు కుటుంబాలు కలిసి మెలిసి జీవిస్తుంటాయి. కలిసి బిజినెస్ చేస్తుంటారు. మంచితనంతో తమ దగ్గర పనిచేసే నలుగురు వ్యక్తుల్ని కూడా వాటాదారులుగా చేర్చుకుంటారు. వాటాలతో సంతృప్తి పడని ఆ నలుగురు, మొత్తం వ్యాపార సామ్రాజ్యంపై కన్నేస్తారు. అనుకున్నదే ఆలస్యంగా.. ఆ రెండు కుటుంబాలని అంతం చేస్తారు. అప్పుడు, సదరు కుటుంబాలకు చెందిన అమర్ (రవితేజ), ఐశ్వర్య (ఇలియానా) ఆప్రమాదం నుండి తప్పించుకుంటారు. చిన్నప్పుడే విడిపోయినా.. తమ తల్లిదండ్రుల్ని చంపిన వాళ్ళని చంపడమే లక్ష్యంగా బతుకుతుంటారు వీళ్ళిద్దరూ..   అమర్, ఐశ్వర్య  వాళ్ళపై ఎలా పగ తీర్చుకున్నారు, అమర్, ఐశ్వర్య మళ్ళీ కలిసారా, అసలు అమర్ అక్బర్ ఆంటొనిల మధ్యఉన్న సంబధం ఏంటి? అనేది తెరపై చూస్తే బాగుంటుంది.
 

నటీనటులు & సాంకేతిక నిపుణులు : 


రవితేజ ఎప్పటిలానే తన ఎనర్జీతో సినిమాని సింగిల్ హ్యాండ్‌తో నడిపించాడు. కామెడీతో, మూడు డిఫరెంట్ క్యారెక్టర్లతో ఆకట్టుకున్నాడు. ఇలియానాని కొద్ది గ్యాప్ తర్వాత స్క్రీన్‌పై చూడడం కొత్తగా అనిపిస్తుంది. ఆమెది పెద్ద రోల్ కాకపోయినా, ఉన్నంతలో.. నటన, గ్లామర్ పరంగా అలరిస్తుంది. సునీల్ సెకండ్‌హాఫ్‌లో బాబీగా నవ్వించగా, హోల్ ఆంధ్రా తెలంగాణా అసోసియేషన్ (వాటా) ఆర్గనైజర్స్‌గా, వెన్నెలకిషోర్, శ్రీనివాస రెడ్డి, గిరి, రఘబాబు.. వాళ్ళకి అసిస్టెంట్‌గా సత్య కాసేపు నవ్విస్తారు. నలుగురు విలన్స్ తమ పాత్ర పరిధి దాటలేదు. థమన్ సాంగ్స్ సోసోగా ఉన్నా, ఆర్ఆర్ మాత్రం బాగుంది. వెంకట్ సి దిలిప్  కెమెరా వర్క్,  మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్.. శ్రీను వైట్ల.... అమర్ అక్బర్  ఆంటొని కథకి, డిసోసియేటివ్ ఐడెంటిటీ అనే డిసీస్ యాడ్ చేసి నవ్వించే ప్రయత్నం చేసాడు. అది అక్కడక్కడ మాత్రమే వర్కవుటైంది కానీ, ఓవరాల్‌గా కాదు. కథ పరంగా కొత్తగా ట్రైచేసే ప్రాసెస్‌లో, కథనం సంగతి మర్చిపోయినట్టున్నాడు వైట్ల... అందుకే, ప్రేక్షకుడికి సినిమాలో తర్వాత సీన్ ఏంటో ముందే అర్థమైపోతుంది. కథానేపథ్యం బాగున్నా, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే లేకపోవడం ఈ సినిమాకి మైనస్ అయింది. అమర్ అక్బర్ ఆంటొని, ఆడియన్స్‌కి, ఓ మోస్తరుగా అనిపిస్తుంది. వరుస పరాజయాలతో సతమతమవుతున్న రవితేజకి, వైట్లకి ఈ మూవీ, కాస్త రిలీఫ్ ఇస్తుందనే చెప్పాలి. 

తారాగణం : రవితేజ, ఇలియానా, సునీల్, లయ, తనికెళ్ళ భరణి, జయప్రకాష్ రెడ్డి, భరత్ రెడ్డి, రవి ప్రకాష్, ఆదిత్యా మేనన్,           వెన్నెలకిషోర్, శ్రీనివాస రెడ్డి, గిరి, రఘబాబు, సత్య తదితరులు.. 

 కెమెరా    :   వెంకట్ సి దిలిప్ 

ఎడిటింగ్‌  :  ఎంఆర్ వర్మ

 సంగీతం :        ఎస్ఎస్ థమన్

నిర్మాణం :       మైత్రీ మూవీ మేకర్స్ 

కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం :   శ్రీను వైట్ల

రేటింగ్  :  2/5

 

మూవీ రివ్యూ - 5 స్టార్ రేటింగ్‌ విధానం...
3.5 స్టార్ - ఉత్తమ చిత్రం
3 స్టార్స్  - చాలా బావుంది! తప్పక చూడాల్సిన సినిమా
2.75 స్టార్స్  - ఉన్నంతలో బావుంది
2.5 స్టార్స్ - సినిమా చూడొచ్చు 
2.25 స్టార్స్ - ఇంకొంచెం శ్రద్ధపెట్టాల్సి ఉంది 
2 స్టార్స్ - చాలా మెరుగుపర్చుకోవాలి

 

 

Don't Miss