ఆకట్టుకుంటున్న అమర్ అక్బర్ ఆంటొని టీజర్

11:41 - October 30, 2018

మాస్‌రాజా రవితేజ, శ్రీనువైట్ల, కాంబినేషన్‌లో, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై, రూపొందుతున్న సినిమా.. అమర్ అక్బర్ ఆంటొని.. గోవా బ్యూటీ ఇలియానా కథానాయిక. రీసెంట్‌గా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసింది చిత్ర బృందం. ముగింపు వ్రాసుకున్నతర్వాతే కథ మొదలు పెట్టాలి అనే డైలాగ్‌తో స్టార్ట్ అయిన అమర్ అక్బర్ ఆంటొని  టీజర్, ఆద్యంతం ఆసక్తి కరంగా ఉంది. అమర్, అక్బర్, ఆంటొనిగా.. మాస్‌రాజా మూడు డిఫరెంట్ గెటప్‌లలో కనిపించాడు. మనకి నిజమైన ఆపద వచ్చినప్పుడు, మనల్ని కాపాడేది మనచుట్టూ ఉన్న బలగం కాదు.. మనలో ఉన్న బలం.. అంటూ రవితేజ చెప్పిన డైలాగ్, వివిధ ప్రాంతాల్లో, డిఫరెంట్ గెటప్స్‌లో వెళ్ళి, రౌడీలను రఫ్ఫాడించడం చూస్తుంటే, మాస్‌రాజా అండ్ శ్రీనువైట్ల ఆర్ బ్యాక్ అనిపిస్తుంది. టీజర్‌లో శ్రీనువైట్ల మార్క్ కామెడీ లేదు కాబట్టి, ఈసారి కొత్త ప్రయత్నం ఏదో చేసాడనిపిస్తుంది. ఇలియానా బొద్దుగా బాగుంది. టీజర్‌కి థమన్ ఇచ్చిన ఆర్ఆర్ హైలెట్ అయింది. మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్‌గా ఉన్నాయి. విడుదల చేసిన తక్కువ టైమ్‌లోనే, టీజర్‌కి మూడు మిలియన్లకి పైగా వ్యూస్ వచ్చాయి. ప్రస్తుతం యూట్యూబ్ ట్రెండింగ్‌లో ఉంది..ఎక్కువ శాతం అమెరికాలో షూటింగ్ జరుపుకుంది. అమర్ అక్బర్ ఆంటొని నవంబర్ 16న విడుదల కానుంది..   

 

Don't Miss