డిసెంబర్ 21న జీరో మూవీ విడుదల

13:06 - November 1, 2018

కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ వరస ఫ్లాప్‌ల తర్వాత, ఆనంద్ ఎల్.రాయ్ డైరెక్షన్‌లో నటిస్తున్న జీరో మూవీపై భారీ అంచనాలు పెట్టుకున్నాడు.
కలర్ ఎల్లో ప్రొడక్షన్ సమర్పణలో, రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై, షారుఖ్ భార్య గౌరీ ఖాన్ దాదాపు రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో జీరో సినిమాను నిర్మిస్తుంది. ఈరోజు షారుఖ్ ఖాన్ తన ట్విట్టర్ ద్వారా జీరో మూవీ న్యూ పోస్టర్స్ రిలీజ్ చేసాడు. ఒక పోస్టర్‌లో కత్రినా కైఫ్‌తో, మరో  పోస్టర్‌లో అనుష్క శర్మతో  షారుఖ్ కనిపించాడు. ఈమూవీలో  షారుఖ్, బువా సింగ్ అనే మరుగుజ్జు క్యారెక్టర్ చేస్తున్న సంగతి తెలిసిందే. కత్రినా‌తో ఉన్న పోస్టర్‌కి చాలామంది నక్షత్రాలను దగ్గరినుండి చూడాలని కలలు కంటారు. కానీ, నేను చంద్రుడినే దగ్గరినుంచి చూసాను అనే క్యాప్షన్ ఇచ్చిన కింగ్ ఖాన్, అనుష్క శర్మతో  ఉన్న పోస్టర్‌కి, ఈ ప్రపంచంలో నాలా ఉండే వ్యక్తి ఆమె ఒక్కతే అని క్యాప్షన్ ఇచ్చాడు. సల్మాన్ ఖాన్ అతిధి పాత్రలో కనిపించబోతున్న జీరో మూవీ, డిసెంబర్ 21న రిలీజవబోతుంది.    

Don't Miss