అర్జున్‌‌పై 50 ప్రశ్నలు సంధించిన పోలీసులు

12:54 - November 6, 2018

గతకొద్ది రోజులుగా సినీ రంగలో సంచలనం రేపుతోంది, మీటూ ఉద్యమం. ఈ వివాదంలో ప్రముఖనటుడు అర్జున్ కూడా చిక్కుకున్నాడు. విస్మయ అనే కన్నడ చిత్రం షూటింగ్ సమయంలో అర్జున్ తనపట్ల అసభ్యంగా ప్రవర్తించాడని, నటి శృతి హరిహరన్ ఆరోపించడం, అర్జున్ ఖండిచండం, వారిద్దరి మధ్య రాజీ కుదర్చడానికి సీనియర్ నటుడు అంబరీష్ ప్రయత్రించినా ఫలితం లేకపోవడంతో, ఎట్టకేలకు అర్జున్ పోలీస్ స్టేషన్ గడప తొక్కక తప్పలేదు. శృతి, అర్జున్‌పై బెంగుళూరులోని కబ్బన్‌పార్క్‌ స్టేషన్‌లో కంప్లైంట్ చెయ్యగా, విచారణకు హాజరుకావాలని పోలీసులు అర్జున్‌కి నోటీసులు పంపడంతో, నిన్న ఆయన పీఎస్‌కు వెళ్ళారు. దాదాపు రెండున్నర గంటలపాటు విచారణ జరగగా, శృతి తనపై చేసినవన్నీ తప్పుడు మరియు నిరాధారమైనవని, ఆచిత్ర దర్శకుడు, కెమెరామెన్, ఇతర నటీనటుల ముందే తను నటించాననీ, షూటింగ్ అనంతరం ఆమెను కార్‌లో ఫాలో చేసానన్నది అబద్ధమని అర్జున్, పోలీసులకు చెప్పాడు. దాదాపు 50 ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారని, విచారణకు పూర్తిగా సహకరించారని, అవసరమైతే ఇంకోసారి విచారణకు పిలుస్తామంటే, సహకరిస్తాననీ చెప్పారని పోలీసులు తెలిపారు. ఈ కేసులో, ఇప్పటికరకు శృతితో పాటు, ఆమె ఫ్రెండ్స్‌‌తో పాటు, విస్మయ మూవీ కెమెరామెన్‌ని పోలీసులు విచారించారు.

Don't Miss